ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 : వర్షం కారణంగా రద్దయిన శ్రీలంక, న్యూజిలాండ్ మ్యాచ్

Telugu Lo Computer
0


సీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో శ్రీలంక, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లు చెరో పాయింట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 258 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అయితే న్యూజిలాండ్ టార్గెట్‌ను ఛేదించడం ప్రారంభించక ముందే ఆర్ ప్రేమదాస స్టేడియంలో వర్షం ప్రారంభమైంది. ఆ తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభం కాలేదు. ఈ మ్యాచ్ రిజల్ట్ టీమిండియాకు లాభాన్ని చేకూర్చింది. శ్రీలంక నాలుగు మ్యాచ్‌లలో రెండు పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ మూడు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బ. ఎందుకంటే న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే రెండు పరాజయాలను చవిచూసింది. ఇప్పుడు సెమీ-ఫైనల్ రేసు మరింత కష్టమైంది. మ్యాచ్ రద్దు కావడం భారత జట్టుకు మేలు చేసింది. భారత్ ఇప్పుడు గరిష్టంగా 10 పాయింట్ల వరకు చేరుకోగలదు. అయితే న్యూజిలాండ్ జట్టుకు 9 పాయింట్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య కూడా మ్యాచ్ జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే సెమీఫైనల్లో స్థానం దాదాపు ఖాయం చేసుకుంటుంది.   

Post a Comment

0Comments

Post a Comment (0)