రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వెళ్తున్న బస్సులో మంగళవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగి ముగ్గురు పిల్లలు, నలుగురు మహిళలతో సహా 15 మంది ప్రయాణికులు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అందిన సమాచారం ప్రకారం, జైసల్మేర్-జోధ్‌పూర్ హైవేలోని థాయత్ గ్రామం సమీపంలో మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బస్సులో మొత్తం 57 మంది ప్రయాణికులు ఉన్నారు. జైసల్మేర్ ప్రయాణం మొదలైన తర్వాత దాదాపు 20 కి.మీ దూరంలో బస్సు వెనక నుంచి అకస్మాత్తుగా పొగలు రావడం ప్రారంభమైంది. డ్రైవర్, ప్రయాణికులు స్పందించే లోపే మంటలు మొత్తం బస్సును చుట్టుముట్టాయి. ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సు అద్దాలను పగటగొట్టి బయటకు దూకారు. చాలా మంది ప్రయాణికులు బ్యాగులు, వస్తువులు కాలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక గ్రామస్తులు సహాయకచర్యల్ని ప్రారంభించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాదానికి కారణాలను పరిశీలిస్తున్నారు. బస్సు ఇంజన్, లేదా వైరింగ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
రాజస్థాన్‌లో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి 15 మంది సజీవ దహనం
October 14, 2025
0
Tags