GT - గ్రాండ్ టోటల్ బటన్ గ్రాండ్ టోటల్ ను చెప్తుంది. ఉదాహరణకు 4 × 2 = 8 అని ఒక గుణకారాన్ని వేసుకుని తరువాత 7 × 6 = 42 అనే వేరే లెక్కను వేసారనుకోండి. ఇప్పుడు GT అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు టోటల్ 50 (08 + 42 = 50) అనే ఆన్సర్ వస్తుంది. ఇది పెద్ద పెద్ద మొత్తాలలో లెక్కలు చేసినప్పుడు ఈజీ గా గ్రాండ్ టోటల్ తెలుసుకోవడానికి పనికొస్తుంది.
MU - మార్కప్ బటన్ ని ఖర్చు, లాభం, డిస్కౌంట్ లను ఖచ్చితంగా, ఈజీ గా లెక్కగట్టేందుకు వాడుతారు. ఉదాహరణకి ఒక వస్తువును 400 రూపాయలకు కి కొనుగోలు చేశారు అనుకోండి, దానిపై 100 రూపాయల మీకు రావాలి ఎట్ ది సేమ్ టైం కస్టమర్‌కు 20% డిస్కౌంట్ ఇవ్వాలి. అలాంటప్పుడు మీకు ఎంత ధరకు వస్తువు అమ్మితే కస్టమర్ కు 20 % డిస్కౌంట్ పోనూ, మీకు వంద రూపాయల లాభం వస్తుందో లెక్కగట్టటానికి ఇది చాలా ఉపయోగం. ఇక్కడ మీరు కొన్న ధర 400 రూపాయలు, దీనిపై మీకు కావాల్సిన లాభం 100 రూపాయలు. అంటే మొత్తం రూ.500 అయింది. కస్టమర్ కు 20 శాతం డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి ముందుగా మీరు కాలిక్యులేటర్ లో మీరు కొన్న ధర ప్లస్ లాభం కలిపి 500 కాబట్టి ఆ నెంబర్ ను ప్రెస్ చెయ్యండి. తరువాత MU బటన్ ను నొక్కి 20 % అని ప్రెస్ చేస్తే మీకు 625 చూపిస్తుంది. అంటే మీరు కస్టమర్ కు చెప్పాల్సిన ధర 625 రూపాయలు. సో సింపుల్ కదా. ఇన్నాళ్లు మీరు ఈ బటన్ వాడనట్టయితే ఇక నుండి వాడి చూడండి. కస్టమర్ కు డిస్కౌంట్ లు వారి ముందే లెక్కగట్టినా వారికి ఒక్క ముక్క అర్థం కాదు. మీకు లెక్క కూడా ఈజీ అయిపోతుంది.
M+, M- మరియు MRC ఈ రెండు బటన్లను ప్లస్ (+ ) మరియు మైనస్ (- ) లెక్కలలో రిజల్ట్ పొందేందుకు వాడతారు. M+ అంటే మెమరీ ప్లస్, అలాగే M- అంటే మెమరీ మైనస్ ఇక MRC అంటే మెమరీ రీకాల్. మీకు 10 ×3 అనే గుణకారం నుండి 2 ×3 అనే గుణకారాన్ని మైనస్ చెయ్యాలనుకుంటే ఈ బటన్లను ఎలా వాడాలో చూద్దాం. ముందుగా 10 ×3 = 30 ను కాలిక్యులేట్ చేసి M + బటన్ను ఒత్తండి. అంటే ఇప్పుడు ఆ 30 మెమరీ చేయబడినది అర్థం. ఇప్పుడు దాంట్లోనుండి మైనస్ చెయ్యవలిసిన 2 ×3 అనే గుణకారం ను ప్రెస్ చెయ్యండి వచ్చే ఆన్సర్ 6 . ఇప్పుడు మీకు మైనస్ ఆన్సర్ కోసం M - ను ప్రెస్ చెయ్యండి. ఇక మొత్తం ఫైనల్ ఆన్సర్ కోసం MRC అంటే బటన్ ను ఒత్తినట్టయితే మీకు ఆన్సర్ 24 వస్తుంది.