10 గ్రాముల పసిడి ధర లక్షా పది వేల దిశగా పరుగులు!

Telugu Lo Computer
0


బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,06,970గా22 క్యారెట్ల ధర రూ.98,050గా ట్రేడ్ అవుతోంది. ఈరోజు 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.880, 22 క్యారెట్ బంగారం రూ.800 పెరిగింది. ఈ 10 రోజుల్లోనే ఏకంగా 5 వేలకు పైగా పెరగడం విశేషం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం లక్షా పది వేల రూపాయల చేరువకు వచ్చేసింది.హైదరాబాద్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,970గా.. 22 క్యారెట్ల ధర రూ.98,050గా కొనసాగుతోంది. విశాఖ, విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.1,07,120గా.. 22 క్యారెట్ ధర రూ.98,200గా ట్రేడ్ అవుతోంది. మరోవైపు వెండి ధర కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. గత ఐదు రోజులుగా వెండి పెడుతోంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై ఈరోజు రూ.900 పెరిగి.. రూ.1,27,000గా నమోదైంది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి లక్షా 37 వేలుగా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)