బీబీనగర్ చెరువులో దూకి ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య !

Telugu Lo Computer
0


తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా రామంతాపూర్ ప్రాంతానికి చెందిన బర్ల సురేంద్ర ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్నాడు. డ్యూటీకి వెళ్ళొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఆయన బీబీనగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త చెరువులో దూకిన విషయం జీర్ణించుకోలేని సురేంద్ర భార్య సంధ్యారాణి.. అదే చెరువులో దూకేందుకు ప్రయత్నించగా స్థానికులు, పోలీసులు కాపాడారు. సురేంద్ర గత పదిరోజులుగా మనస్తాపంతో బాధపడుతున్నారని బంధువులు చెబుతున్నారు. పదిరోజుల నుంచి చావు తనను పిలుస్తోందని, ఆర్థిక ఇబ్బందులు లేవని ఆడియో రికార్డ్ చేసి ఫోన్ చెరువు కట్టపైనే పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


Post a Comment

0Comments

Post a Comment (0)