సీపీఎస్‌ ఉద్యోగులకు మొదటి విడత డీఏ బకాయిలు విడుదల

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని సీపీఎస్‌ ఉద్యోగులకు మొదటి విడత డీఏ బకాయిలు ప్రభుత్వం విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. డీఏ బకాయిలు విడుదలపై ఏపీ సచివాలయ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. సీపీఎస్‌ ఉద్యోగుల డీఏ ఏరియర్స్ ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్‌ ఉద్యోగులకు జమ చేసింది. త్వరలోనే మిగిలిన సీపీఎస్ ఉద్యోగులందరికీ 90 శాతం బకాయిలు నగదుగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సమాచారం. చెల్లించాల్సిన బకాయిలు సుమారు ఆరు విడతలుగా చెల్లించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో ఉద్యోగికి రూ.40 వేలు నుంచి రూ.70 వేల వరకు సోమవారం బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం జమ చేసింది. మిగిలిన వారికి ఆరు విడతల్లో ఒక్కో ఉద్యోగికి రూ.2 నుంచి రూ.4 లక్షల వరకూ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఈ ప్రక్రియ మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దసరా, దీపావళి పండుగలు వస్తుండడంతో ప్రభుత్వం ఈ మేరకు కొన్ని బకాయిలు చెల్లించింది. కొద్ది మొత్తంలో బకాయిలు చెల్లించడంతో ప్రభుత్వ ఉద్యోగులు కొంత అసహనంతో ఉన్నారు. దసరా, దీపావళి పండుగ వరకు మొత్తం బకాయిలు చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)