ఏసీ పేలి పెంపుడు కుక్కతో సహా ముగ్గురు మృతి

Telugu Lo Computer
0


ర్యానాలోని ఫరీదాబాద్లో ఓ కుటుంబం ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా నాలుగు అంతస్తుల బిల్డింగ్, ఫస్ట్ ఫ్లోర్లో ఏసీ పేలి పెంపుడు కుక్కతో సహా ఆ కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. భార్యా,భర్త, కూతురు, పెంపుడు కుక్క ఈ దుర్ఘటనలో చనిపోగా.. కిటికీలో నుంచి దూకి కొడుకు ప్రాణాలు దక్కించుకున్నాడు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఏసీ పేలడంతో ఈ విషాదం జరిగింది. రెండో ఫ్లోర్ మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఊపిరాడక, తప్పించుకునే దారి కానరాక కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన పెను విషాద ఘటన ఇది. ఏసీ పేలిన సమయంలో ఫస్ట్ ఫ్లోర్లోని ఇంట్లో ఎవరూ లేరు. చనిపోయిన వారిని సచిన్ కపూర్, అతని భార్య రింకూ కపూర్, వారి కూతురు సుజన్ కపూర్గా పోలీసులు గుర్తించారు. చనిపోయిన ముగ్గురూ ఒకే గదిలో నిద్రిస్తుండగా, సచిన్ కపూర్ కొడుకు వేరే గదిలో పడుకున్నాడు. అందువల్లే అతనికి తప్పించుకునే అవకాశం ఉంది. పొగలు కమ్ముకోగానే భయంతో అతని రూంలోని కిటికీ నుంచి బయటకు దూకేశాడు. సెకండ్ ఫ్లోర్ నుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అతని పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పెద్ద శబ్దంతో ఏసీ పేలిందని స్థానికులు తెలిపారు. ఫోర్త్ ఫ్లోర్ లో ఏడుగురితో ఉన్న కుటుంబం నివసిస్తుందని, థర్డ్ ఫ్లోర్ను సచిన్ కపూర్ తన ఆఫీస్గా వినియోగించుకుంటున్నాడని పొరుగున ఉండే మయాంక్ తెలిపాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)