ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ కుటుంబం నుంచి రాజకీయ వారసుడిగా తన కుమారుడు రాజారెడ్డిని ఎంట్రీ చేయించేందుకు పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ తొలి అడుగు వేశారు. ఈ మేరకు కర్నూలుకు తీసుకెళ్లి రాజారెడ్డిని ప్రజలకు పరిచయం చేశారు. ఇన్నాళ్లూ వైఎస్ షర్మిల కుమారుడిగా, తల్లిచాటు బిడ్డగా ఉన్న వైఎస్ రాజారెడ్డికి ఉన్నత విద్యావంతుడిగా, తన పని తాను చేసుకుపోతాడనే పేరుంది. వైఎస్ కుటుంబం నుంచి వచ్చినా రాజకీయంగా ఎలాంటి హంగామా చేయకుండా సైలెంట్ గా ఉంటూ వస్తున్న రాజారెడ్డిని ఉన్నట్లుండి రాజకీయాల్లోకి తీసుకురావాలని షర్మిల నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే ఇవాళ అకస్మాత్తుగా తన తల్లి విజయమ్మ ఆశీర్వాదం ఇప్పించి కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఉల్లి రైతుల్ని కలిసేందుకు రాజారెడ్డిని షర్మిల తీసుకెళ్లారు. కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఉల్లి రైతుల్ని పరామర్శించే సమయంలోనూ తన కుమారుడు రాజారెడ్డిని పక్కనే నిలబెట్టిన షర్మిల, ప్రత్యేకంగా ఎలాంటి పరిచయం కూడా చేయలేదు. అయితే చివర్లో రాజారెడ్డిని పొలిటికల్ ఎంట్రీ కోసమే తీసుకుని వచ్చారా అని మీడియా అడిగిన ప్రశ్నకు తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వస్తాడంటూ షర్మిల చెప్పారు.
వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ?
September 08, 2025
0
Tags