ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ నదిని తప్పకుండా ప్రక్షాళన చేస్తాం !

Telugu Lo Computer
0


స్మాన్‌ సాగర్‌ వద్ద చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్‌ 2, 3 ప్రాజెక్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ నదిని తప్పకుండా ప్రక్షాళన చేస్తాం అని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. గత ఏడాదే గోదావరి ఫేజ్ 2, 3 పనులు ప్రారంభిద్దాం అనుకున్నా కొందరు అడ్డుకున్నారని, గోదావరి ఫేజ్ 2, 3 ద్వారా 20 టీఎంసీల నీటిని తీసుకువస్తాం అని చెప్పారు. 2014 నుంచి బీఆర్ఎస్ ఒక్క చుక్క నగరానికి తీసుకురావాలనే ఆలోచన చేయలేదని, తాము మరలా అధికారంలోకి వచ్చాక గోదావరి నీటిని తీసుకురావడానికి ప్రణాళికలు చేసి ముందుకెళ్తున్నామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టి 2 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం అని సీఎం ర్కొన్నారు. హైద్రాబాద్ నగరంకు ప్రపంచ దేశాల్లో గొప్ప పేరుంది. 1908లో నగర ప్రమాదాన్ని నివారించడానికి నిజాం సర్కార్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించారు. ప్రపంచంలోనే గొప్ప ఇంజినీర్లతో నిజాం సర్కార్ ఈ ప్రాజెక్టులు కట్టింది. దూరదృష్టితో ఆలోచించి ఈ ప్రాజెక్టులు కట్టడంతో నగర దాహం తీరుతోంది. నగరంలో జనాభా పెరుగుతోంది, ఉద్యోగాల కోసం హైదరాబాద్ వస్తున్నారు. నగర జనాభా కోటిన్నరకు చేరింది. పీజేఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఖాళీ కుండలతో అసెంబ్లీ ముందు ధర్నాలు చేసి, మంజీరా, కృష్ణా జలాలను హైదరాబాద్ తరలించారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు శ్రీపాద ఎల్లంపల్లి నీటిని తరలించడానికి శంకుస్థాపన చేస్తే 2014 నుంచి నగరానికి వచ్చాయి’ అని సీఎం రేవంత్ తెలిపారు. అప్పట్లో ఐటీ మంత్రిగా ఉన్న వ్యక్తి నగరానికి వచ్చే నీటిని నెత్తి మీద చల్లుకున్నాడు. ఆయన నీళ్ళు చల్లుకున్నంత మాత్రాన చేసిన పాపాలు ఎక్కడికి పోవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వివిధ ప్రాజెక్టుల నుంచి నగరానికి నీళ్లు తీసుకువచ్చారు. 2014 నుంచి ఒక్క చుక్క నగరానికి తీసుకురావాలనే ఆలోచన చేయలేదు. తిరిగి మేము అధికారంలోకి వచ్చాక గోదావరి నీళ్ళని తీసుకురావడానికి ప్రణాళికలు తయారు చేసి ముందుకెళ్తున్నాం. మూసీ నీళ్ళు విషంగా మారాయి. భువనగిరి, చౌటుప్పల్ ప్రాంతాల్లో విషపు నీళ్ళు పారుతున్నాయి. మూసీ నీటి వల్ల ఆడబిడ్డలకు పురిటి సమస్యలు వస్తున్నాయి. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ నదిని తప్పకుండా ప్రక్షాళన చేస్తాం. పోయిన ఏడాదే గోదావరి ఫేజ్ 2, 3 పనులు ప్రారంభిద్దాం అనుకున్నా కొందరు అడ్డుకున్నారు. గోదావరి ఫేజ్ 2, 3 ద్వారా 20 టీఎంసీల నీటిని తీసుకువస్తాం. వీటిలో 16 టీఎంసీలు తాగునీటి కోసం, మిగతా 4 టీఎంసీలతో మూసీని బాగు చేస్తాం’ అని సీఎం చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)