మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా తిప్పరి తిరుపతి ?

Telugu Lo Computer
0


మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నూతన ప్రధాన కార్యదర్శిగా తిప్పరి తిరుపతిని ఎన్నుకున్నట్లు తెలుస్తున్నది. బస్తర్‌ కార్యదర్శిగా మడివి హిడ్మాను నియమించినట్లు సమాచారం. ఇటీవల కాలంలో లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ విషయం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బస్తర్‌ డివిజన్‌ నారాయణ్‌పూర్‌ జిల్లా అడవుల్లో మే 21 జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు అతి సమీప శిష్యుడిగా తిప్పరి తిరుపతి వ్యవహరించినట్లు తెలుస్తోంది. తిరుపతి అలియాస్‌ దేబూజి తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లాకు చెందిన మావోయిస్టు పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. అలాగే హిడ్మా అలియాస్‌ సంతోష్‌కు దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటి భాధ్యతలను అప్పగించారు. ఒకటవ బెటాలియన్‌ కమాండర్‌గా హిడ్మా పనిచేస్తున్నారు. నూతనంగా దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటి కార్యదర్శి భాధ్యతలను అప్పగించారు. నంబాల కేశవరావు మృతితో ఆ పోస్టు ఖాళీగా ఉంది. నాలుగు నెలల వ్యవధిలో మావోయిస్టు పార్టీ ఈ భాధ్యతలు ఎవరికి అప్పగిద్దామని ఆలోచన చేసినట్లు తెలిసింది. తరువాత కేశవరావు అతి సమీప శిష్యుడికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తున్నది.

Post a Comment

0Comments

Post a Comment (0)