అసోంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ సింగపూర్ లో స్కూబా డైవింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. జుబిన్ గార్గ్ మరణానికి దేశవ్యాప్తంగా ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సింగపూర్‌లో జరిగిన నార్త్ ఈస్ట్ ఫెస్టివల్‌లో జుబిన్ గార్గ్ ప్రదర్శన ఇవ్వడానికి వెళ్లారు. ఈ క్రమంలోనే స్కూబా డైవింగ్ చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే సింగపూర్ పోలీసులు ఆయనను సముద్రం నుంచి రక్షించి, సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. అత్యవసర వైద్య చికిత్స అందించినప్పటికీ, వైద్యులు ఆయనను రక్షించలేకపోయారు. జుబిన్ మరణం ఆయన అభిమానులను, అసోం ప్రజలను తీవ్రంగా కలచివేసింది. భారతీయ సంగీత పరిశ్రమలో ఒక విషాదాన్ని మిగిల్చింది. జుబిన్ మరణంపై అసోం, నార్త్ ఈస్ట్‌తో పాటు దేశవ్యాప్తంగా అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. చాలా మంది తమ అభిమాన గాయకుడికి నివాళులర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
స్కూబా డైవింగ్ చేస్తుండగా ప్రాణాలు కోల్పోయిన జుబిన్ గార్గ్ !
September 19, 2025
0
Tags