ప్రపంచంలో అత్యంత విలువైన టాప్-10 ఆటోమేకర్స్ జాబితాలో మారుతీ సుజుకీ స్థానం సంపాదించింది. దాదాపు 57.6 మిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఫోర్డ్, జనరల్ మోటార్స్ (జీఎం), ఫోక్స్‌వ్యాగన్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలను దాటేసింది. ప్రపంచ ఆటోమేకర్స్ ర్యాంకింగ్స్‌లో టెస్లా అగ్రస్థానంలో ఉంది. దాని మార్కెట్ విలువ 1.4 ట్రిలియన్ డాలర్లు. రెండో స్థానంలో టయోటా (314 బిలియన్ డాలర్లు), మూడో స్థానంలో బీవైడీ (133 బిలియన్ డాలర్లు), నాలుగో స్థానంలో ఫెరారీ (92.7 బిలియన్ డాలర్లు), ఐదో స్థానంలో బీఎండబ్ల్యూ (61.3 బిలియన్ డాలర్లు), ఆరో స్థానంలో మెర్సిడెస్-బెంజ్ (59.8 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. తాజాగా 57.6 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో మారుతీ సుజుకీ.. ఫోర్డ్ (46.3 బిలియన్ డాలర్లు), జీఎమ్ (57.1 బిలియన్ డాలర్లు), ఫోక్స్‌వ్యాగన్‌లను (55.7 బిలియన్ డాలర్లు) వెనక్కి నెట్టి ఎనిమిదో స్థానాన్ని అందుకుంది.
ప్రపంచ ఆటోమేకర్స్ ర్యాంకింగ్స్‌లో టెస్లా అగ్రస్థానం : మారుతీ సుజుకీ ఎనిమిదో స్థానం
September 29, 2025
0
Tags