దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో భారీ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో భాగంగా కొద్ది రోజుల క్రితం ఓ షెడ్యూల్ ను కెన్యాలో షూట్ చేశారు. ఈ నేపథ్యంలో షూటింగ్ కు సంబంధించిన అన్ని అనుమతులను కెన్యా ప్రభుత్వం చిత్ర బృందానికి ఇచ్చింది. ఈ షూటింగ్ అనంతరం కెన్యా నేతలు ఎక్స్ వేదికగా స్పందిస్తూ " గత రెండు వారాల క్రితం కెన్యా ప్రపంచంలోనే గొప్ప చిత్రనిర్మాతలలో ఒకరైన ఎస్ ఎస్ రాజమౌళికి వేదికగా మారింది. ఆయన దార్శనిక భారతీయ దర్శకుడు, స్క్రీన్ రైటర్, కథకుడు, ఆయన రచనలు ఖండాలు అంతటా ప్రేక్షకుల ఊహలను దోచుకున్నాయి అంటూ ఓ ప్రత్యేకమైన నోట్ రాసుకొచ్చారు. దానిపై ఎస్ఎస్ రాజమౌళి స్పందిస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. "కెన్యాను సందర్శించడం నిజంగా జీవితంలో ఒక్కసారైనా అనుభవించదగిన అందమైన అనుభవం. దాని విస్తారమైన ప్రకృతి దృశ్యాలు, అద్భుతమైన వైవిధ్యం కలిగిన వన్యప్రాణులతో అక్కడ చిత్రీకరణ నా కెరీర్‌లో మరపురాని క్షణాలలో ఒకటి. మా షూటింగ్ అంతటా వారి అద్భుతమైన మద్దతు, ఆతిథ్యానికి కెన్యా ప్రభుత్వానికి, మసాయి మారా, నైవాషా, సంబురు, అంబోసేలి స్థానికులకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను." అని రాజమౌళి రాసుకొచ్చారు.
కెన్యాను సందర్శించడం నిజంగా జీవితంలో ఒక్కసారైనా అనుభవించదగిన అందమైన అనుభవం !
September 05, 2025
0
Tags