ఆంధ్రప్రదేశ్ లో పీపీపీ విధానంలో 10 కొత్త వైద్య కళాశాలలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. పీపీపీ విధానంలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటుచేయనున్నారు. యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2025 జనవరి 1 నుంచి రాజధానిలో భూమి కేటాయించిన విద్య, ఆరోగ్య సంరక్షణ సంస్థలకు అమ్మకం,లీజు ఒప్పందాలు అమలు చేసేటప్పుడు రీయింబర్స్‌మెంట్‌ ప్రాతిపదికన స్టాంప్‌ డ్యూటీ చెల్లింపు నుంచి మినహాయింపు. రాష్ట్రంలో క్యాపిటల్‌ సిటీ ప్రాంతం మినహా అర్బన్‌ లోకల్‌ బాడీ సంస్థలు, ఉడాలు, సీఆర్‌డీఏ పరిధిలో అనధికారికంగా నిర్మించే భవనాలు, మంజూరైన ప్లాన్లను ఉల్లంఘించి, నిర్మించిన భవనాల నియంత్రణ, జరిమానాల విధింపు. మదర్‌ డెయిరీ ఫ్రూట్‌, వెజిటబుల్‌, ఏస్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ల పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ సిఫారసులకు సమ్మతి. ప్రాజెక్టుల ప్రారంభంలో వేగం కోసం ఎస్‌ఐపీబీ సిఫారులకు ఆమోదం. అనంతపురంలోనిమడకశిరలో 1,197కోట్లతో హెచ్‌ఎఫ్ సీఎల్‌ పెట్టే పెట్టుబడి ప్రతిపాదనకు సమ్మతి. భోగాపురం ఎయిర్‌పోర్టులో ఫోర్‌స్టార్‌ అభివృద్ధికి ప్రోత్సాహకాలు. క్లీన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ సంస్థ సోలార్‌ ప్రాజెక్ట్‌ను నంద్యాలజిల్లా కోటపాడు నుంచి అవుకు గ్రామానికి మార్పు. కడపజిల్లా జమ్ములమడుగు, ముద్దనూరు మండలాల్లోని గ్రామాల్లో 100 మెగావాట్ల విండ్‌ కెపాసిటీ, కడప జిల్లా మైలవరం మండల గ్రామాల్లో 60 మెగావాట్ల సోలార్‌ విండ్‌ హైబ్రీడ్‌ పవర్‌ ప్రాజెక్టులకు సంబంధించి హెక్సా ఎనర్జీ బీహెచ్‌ ఫైవ్‌ చేసిన అభ్యర్థనలకు ఆమోదం. బ్రైట్‌ ఫ్యూచర్‌ పవర్‌కు అనంతపురం జిల్లా రాయదుర్గం, బ్రహ్మసముద్రం, గుమ్మగట్ట, కానేకల్‌ మండల గ్రామాల్లో 349.80 మెగావాట్ల విండ్‌ పవర్‌ కెపాసిటీ కేటాయింపు సంబంధించి, అనంతపురం జిల్లాలో కుడైర్‌, ఉరవకొండ, వజ్రకరూర్‌ మండల గ్రామాల్లో సెరెంటికా రెన్యూవబుల్స్‌ ఇండియా24 ప్రైవేట్‌లిమిటెడ్‌కు 250 మెగావాట్ల విండ్‌ ప్రాజెక్ట్‌ కేటాయింపులకు, కర్నూలు జిల్లా తుగ్గిలి, పత్తికొండ, దేవనకొండ, పండికోన, ఆస్పరీ మండలాల్లో సెరెంటికా రెన్యూవబుల్‌ ఇండియా 25 ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 300 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ కేటాయింపుల ప్రతిపాదనకు ఆమోదం. కడప జిల్లా కొప్పోలులోని పంప్‌ స్టోరేజీ పవర్‌ ప్రాజెక్ట్‌ సామర్థ్యాన్ని 360 మెగావాట్ల నుంచి 2,400 మెగావాట్లకు పెంపు. మంగళగిరి గోల్డ్‌ క్లస్టర్‌ ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ రూల్స్‌ 2025కు ఆమోదం. థర్డ్‌ పార్టీ ఆక్రమణలో ఉన్న వ్యక్తులకు (347 మందికి) అదనపు భూముల క్రమబద్ధీకరణ/ కేటాయింపుల కోసం రెవెన్యూశాఖ ప్రతిపాదనకు ఆమోదం.

Post a Comment

0Comments

Post a Comment (0)