తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ని సీఎం చంద్రబాబు బాగా అభివృద్ధి చేస్తున్నారని, అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారన్నారు. ఏపీకి ప్రధాని మోడీ రూ.లక్షల కోట్లు కేటాయిస్తున్నారని చెప్పారు. నా పుట్టినరోజు నాడు ఏటా స్వామి వారి దర్శనానికి వస్తుంటా. గతేడాది యూనివర్సిటీలు కావాలని కోరుకున్నా. దేశంలోనే మూడు పెద్ద డీమ్డ్ వర్సిటీలు నడిపిస్తున్నా. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో పదేళ్లలో దేశంలో ఎక్కడా లేని అభివృద్ధిని కేసీఆర్ చేశారు. హైదరాబాద్‌కు మల్టీ నేషనల్ కంపెనీలను కేటీఆర్ తీసుకొచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగాలేదు. గతంలో ఏపీలో అమ్ముకుని హైదరాబాద్ వచ్చేవారు. ఇప్పుడు పరిస్థితి మొత్తం రివర్స్ అవుతోంది. తెలంగాణ వాళ్లు ఏపీలో ఆస్తులు కొని వ్యాపారాలు చేస్తున్నారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే పాతరోజులు వస్తాయని మల్లారెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారు !
September 09, 2025
0
Tags