హైదరాబాద్ లో భారీ పైరసీ ముఠాలను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను టాలీవుడ్ సినీ పెద్దలకు పోలీసులు వివరించారు. ఈ సమవేశంలో హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, నాని, రామ్, నాగచైతన్య.. ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో పటు పలువురు దర్శకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పైరసీ ముఠాల పని తీరును పోలీసులు వివరించారు. సినిమాలు థియేటర్ రిలీజ్ రాకముందే హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్లు ఎలా బయటకు వస్తున్నాయో తెలుసుకుని అందరూ షాక్ అయ్యారు. హ్యాకర్లకు, పైరసీ ముఠాలకు బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులే సహకరిస్తున్నారని పోలీసులు స్పష్టం చేశారు. సీవీ ఆనంద్ పైరసీ ముఠాలకు వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తాం అని చెప్పారు. ‘ఐబొమ్మ నిర్వాహకులను త్వరలోనే పట్టుకుంటాము. దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసి అధునాతన పరికరాలు వాడి పైరసీ ముఠాను పట్టుకున్నాము. ఐబొమ్మ నిర్వాహకులను సైతం పట్టుకుంటాం’ అని చెప్పారు. ఐబొమ్మకు చెందిన నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
త్వరలో ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తాం : సీవీ ఆనంద్ వార్నింగ్!
September 30, 2025
0
Tags