తమ వ్యాపారంలోని క్రిటికల్ వర్క్ ను ఇండియాకు షిఫ్ట్ చేస్తున్న అమెరికా సంస్థలు ?

Telugu Lo Computer
0


మెరికా సంస్థలు హెచ్1బి వీసాల కఠినతరం తర్వాత తమ వ్యాపారంలోని క్రిటికల్ వర్క్ భారతదేశానికి షిఫ్ట్ చేస్తున్నారు. దీంతో గ్లోబల్ క్యాపబిటిలీ సెంటర్లు తమ ఆపరేషన్స్ ఇండియాలో పెంచుతున్నాయి. ఈ సంస్థలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నుంచి ఫైనాన్స్ వరకు ఇండియాకు తరలిస్తున్నట్లు ఆర్థిక వేత్తలు, పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 1700 జీసీసీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దీంతో ఫార్మా నుంచి ఆటో వరకు అనేక కంపెనీలు తమ పనిని భారతదేశానికి మార్చటం ఇక్కడి టాలెంట్ అమెరికా ఇచ్చే హెచ్1బి వీసాల కోసం కష్టపడటం తగ్గుతుందని తెలుస్తోంది. మరోపక్క ఏఐ కొత్త పుంతలు తొక్కటం నుంచి వీసా రూల్స్ మార్పులను అమెరికా సంస్థలు తెలివిగా అధిగమిస్తూ కొత్త లేబర్ స్ట్రాటజీ దిశగా పయనిస్తున్నాయని తెలుస్తోంది. ఈ మెగా షిఫ్ట్ కోసం అవసరమైన వ్యూహాత్మక మార్పుల కోసం అమెరికా సంస్థలు ప్లాన్స్ స్పీడప్ చేశాయి. జీసీసీ పరిశ్రమలో భారతదేశంలో డెలాయిట్ లీడర్ గా కొనసాగుతోంది. అయితే జీసీసీలు వెంటనే పని స్టార్ట్ చేయటానికి వీలుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ అధ్యక్ష గడువు ముగిసే వరకు అమెరికా టెక్ దిగ్గాజాలైన అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ అలాగే బ్యాంకింగ్ కంపెనీలు జేపీ మోర్గన్ నుంచి వాల్ మార్ట్ వరకు ఇదే తరహా వ్యూహాలతో తమ లేబర్ షార్టేజ్ సమస్యలను హెచ్1బి వీసాల వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా ముందుకు సాగటం దేశీయంగా కొత్త ఉద్యోగ అవకాశాలు టాలెంట్ పూల్ కి అందుబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)