అమరులైన 18 మంది జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున చెక్కులు అందజేత

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని నాంపల్లి, మీడియా అకాడమీ భవనంలో జర్నలిజం వృత్తిలో అమరులైన జర్నలిస్టుల కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. ఇటీవల మరణించిన 18 మంది జర్నలిస్టు కుటుంబ సభ్యులకి లక్ష రూపాయల సాయం అందించారు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు పనిచేస్తారని, ప్రభుత్వ దృష్టికి సమస్యలు తీసుకొచ్చి వాటిని పరిష్కరించేలా చేయడంలో జర్నలిస్ట్ ల పాత్ర గొప్పదని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని సీతక్క పునరుద్ఘాటించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)