బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ లడఖ్ ప్రజలు, వారి సంస్కృతి, సాంప్రదాయాలపై దాడి చేస్తున్నాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదివారం పేర్కొన్నారు. లడఖ్‌ను ఆరవ షెడ్యూల్ కింద చేర్చాలని డిమాండ్ చేశారు. "లడఖ్ ప్రజలు తమ గొంతుకను వినిపించాలని భావించారు. బదులుగా బీజేపీ నలుగురు యువకులను చంపి, సోనమ్ వాంగ్‌చుక్‌ను జైలులో పెట్టింది. హత్యలను ఆపండి, హింసను ఆపండి, బెదిరింపులను ఆపండి" అని ఎక్స్‌లో పేర్కొన్నారు. లడఖ్‌కు ఒక గొంతుక ఇవ్వాలని, ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. లెహ్‌లో వరుసగా ఐదవరోజు కర్ఫ్యూ కొనసాగుతోంది. ఆంక్షల సడలింపుపై నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్ కవిందర్ గుప్తా భద్రతా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు ఆదివారం ప్రకటించాయి. పగటిపూట ఆంక్షలను సడలించే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి.
లడఖ్‌లో హత్యలను ఆపండి, హింసను ఆపండి, బెదిరింపులను ఆపండి : ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ డిమాండ్
September 28, 2025
0
Tags