వన్యప్రాణి ఫొటోగ్రాఫర్ వసుధ చక్రవర్తి దుర్మరణం

Telugu Lo Computer
0


ర్నాటకలోని కొల్లూర్‌, సౌపర్ణిక నదిలో బెంగళూరుకు చెందిన వసుధ చక్రవర్తి (45) మృతదేహాన్ని నిన్న కనుగొన్నారు.ఆగస్టు 27న వసుధ కారులో బెంగళూరు నుంచి కొల్లూరుకు వచ్చారు. కారును గెస్ట్‌హౌస్ ముందు పార్క్ చేసి, గుడిలోకి ప్రవేశించారు. గుడిలో ఆమె అసాధారణ ప్రవర్తనను ఇతరులు గమనించారు. ఆ తర్వాత ఆమె గుడి నుంచి బయటికి పరుగెత్తింది. ఈలోగా వసుధకు ఫోన్ చేసినా సమాధానం లేకపోవడంతో ఆమె తల్లి విమల మరుసటి రోజు కొల్లూరుకు చేరుకున్నారు. వెతకగా కూతురి గురించి ఎటువంటి సమాచారం లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేయగా, ఆమె నదిలోకి దూకడం చూశామని కొందరు సాక్ష్యం ఇచ్చారు. దాని ఆధారంగా శనివారం నుంచి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఈతలో నిపుణుడైన ఈశ్వర్ మాల్పెతో కలిసి నదిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఆమె దూకినట్లు చెప్పిన ప్రదేశం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో నదిలో మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)