తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఆధారంగా కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడం తెలిసిందే. దీనిపై మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ లో వీరికి స్వల్ప ఊరట లభించింది. హైకోర్టు ఈ పిటిషన్ తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. తదుపరి విచారణ తేదీ వరకు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం కమిషన్ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ఏజీ తెలిపారు. అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు, సీబీఐ దర్యాప్తునకు ఏ సంబంధం లేదని కోర్టుకు ఏజీ తెలిపారు.
తదుపరి విచారణ తేదీ వరకు కేసీఆర్, హరీష్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు !
September 02, 2025
0
Tags