విమానం టైర్‌ భాగం నుంచి మంటలు : లక్నో ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లోని లక్నో ఎయిర్‌పోర్టులో ఘోర విమాన ప్రమాదం తప్పింది. విమానం టైర్‌ భాగం నుంచి మంటలు రావడంతో ప్రయాణీకులంతా భయాందోళనకు గురయ్యారు. అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువక ముందే మళ్లీ ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురవుతున్నారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో 250 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం హజ్‌ యాత్రికులతో జెడ్డా నుంచి బయల్దేరి ఆదివారం ఉదయం లక్నో ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అయితే ల్యాడింగ్‌ సమయంలో ల్యాండింగ్‌ గేర్‌ నుంచి నిప్పు కణికలు ఎగసి పడడం సిబ్బంది గమనించారు. విమానం ట్యాక్సీ వేకి చేరుకోగానే ప్రయాణికులందరినీ దించేశారు. ఎడమ టైర్‌ వద్ద ల్యాండింగ్‌ గేర్‌ నుంచి మంటలు వస్తున్నట్లు గుర్తించారు. స్పందించిన సిబ్బంది వెంటనే మంటలను ఆర్పేశారు. ఈ ఘటన ఎవరికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఈ ఘటనపై విచారణ చేపడుతున్నామని లక్నో ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)