జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగిస్తూ నవరాత్రి సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రి మొదటి రోజున స్వావలంబన దిశగా ఒక పెద్ద అడుగు వేస్తున్నట్లు ప్రధాని అన్నారు. రేపటి నుండి అందరికీ తీపి కబుర్లు అందుతాయని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఎంతో ఆదాయం మిగులుతుందని ప్రధాని తెలిపారు. పండగ సమయంలో దేశంలోని అందరికీ మేలు జరగడమే కాకుండా జీఎస్టీ సంస్కరణలతో భారత వృద్ధి రేటు మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో దేశంలోని ప్రతి పౌరుడి డబ్బు ఆదా అవుతుందని ప్రధాని పేర్కొన్నారు. " దేశ ప్రజలకు దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం. జీఎస్టీ తగ్గింపు వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం. జీఎస్టీ మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి ఎంతో మేలు చేస్తాయి. నూతన జీఎస్టీ వల్ల ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం. జీఎస్టీ సంస్కరణలు ఆత్మ నిర్భర్ భారత్ కు ఊతమిస్తాయి. సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఇవి సాయం చేస్తాయి. జీఎస్టీ సంస్కరణలతో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజల పొదుపు పెరుగుతుంది" అని ప్రధాని తెలిపారు. గతంలో దేశంలో ఎన్నో పన్నులు ఉండేవని, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలన్న పన్నులు కట్టాల్సి ఉండేదన్నారు. ఈ మేరకు 2017లో జీఎస్టీని తీసుకొచ్చినట్లు తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో భారత వృద్ధి రేటు మరింత పెరుగుతుందని, అలాగే దేశంలోని ప్రతి పౌరుడి డబ్బు ఆదా అవుతుందన్నారు. రేపటి నుంచి నిత్యావసరాల ధరలు తగ్గుతున్నాయని తెలిపారు. నిత్యావసరాలపై కేవలం 5 శాతం పన్ను మాత్రమే ఉన్నట్లు తెలిపారు. 12 శాతం ఉన్న 99 శాతం వస్తువులు 5 శాతం పన్ను స్లాబ్ లోకి వచ్చాయన్నారు. అలాగే హెల్త్ ఇన్సురెన్స్, ఫార్మా ధరలు తగ్గుతాయని వివరించారు.
నవరాత్రి మొదటి రోజున స్వావలంబన దిశగా ఒక పెద్ద అడుగు : ప్రధాని నరేంద్ర మోడీ
September 21, 2025
0
Tags