మెగా డీఎస్సీలో అర్హత పొందిన అభ్యర్థులందరికీ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదల అనంతరం ఆయన 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ''మెగా డీఎస్సీ వాగ్దానం నెరవేరింది. ఈ మైలురాయి నా బాధ్యతను మరింత పెంచింది. ఈసారి జాబితాలో పేరు లేని వారు నిరుత్సాహపడొద్దు. హామీ ఇచ్చినట్లు ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైనే చేశారు'' అని లోకేశ్ పేర్కొన్నారు.
డీఎస్సీ జాబితాలో పేరు లేని వారు నిరుత్సాహపడొద్దు !
September 15, 2025
0
Tags