దేశీయ మార్కెట్లో బోల్డ్ ఎన్ 1 5G మోడల్ విడుదల లావా చేసింది. ఈ ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్ - రూ. 7,499, 4GB RAM + 128GB స్టోరేజ్ - రూ. 7,999 రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. విక్రయాలు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఎర్లీ డీల్స్ ద్వారా జరుగుతున్నాయి. అదనంగా SBI క్రెడిట్/డెబిట్ కార్డులతో రూ. 750 డిస్కౌంట్ లభిస్తుంది. లావా Bold N1 5Gలో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే (1612×720 పిక్సెల్స్), 90Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో. ఈ కాంబినేషన్ వినియోగదారులకు సాఫ్ట్ స్క్రోలింగ్, స్మూత్ విజువల్ అనుభవాన్ని ఇస్తుంది. ఈ ఫోన్‌లో UNISOC T765 (6nm) ఆక్టా-కోర్ SoC ఉంది. 2x Cortex A76 (2.3GHz), 6x Cortex A55 (2.1GHz), Mali-G57 MC2 GPU గ్రాఫిక్స్ కోసం రోజువారీ టాస్కులకు సరిపడే స్థిరమైన పనితీరును అందిస్తుంది. Android 15 తో ఈ ఫోన్ లాంచ్ కావడం ప్రత్యేకత. వినియోగదారులకు 1 Android OS అప్‌డేట్ 2 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు లభిస్తాయి. 4GB LPDDR4x RAM (అదనంగా 4GB వర్చువల్ RAM సపోర్ట్), 64GB/128GB స్టోరేజ్ ఆప్షన్స్ మైక్రోSD కార్డు ద్వారా 1TB వరకు విస్తరించుకోవచ్చు. రియర్ కెమెరా - 13MP ప్రైమరీ లెన్స్ + LED ఫ్లాష్, 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్, ఫ్రంట్ కెమెరా - 5MP సాధారణ ఫోటోగ్రఫీ, వీడియో కాలింగ్ అవసరాలకు సరిపోతుంది. 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, బాక్స్‌లో మాత్రం 10W ఛార్జర్ మాత్రమే అందించబడింది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, IP54 రేటింగ్ (డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెంట్), 5G SA/NSA, 4G VoLTE సపోర్ట్, Wi-Fi 802.11 ac, Bluetooth 5.0, GPS + GLONASS, USB Type-C పోర్ట్.
లావా బోల్డ్ ఎన్1 5G స్మార్ట్ ఫోన్ విడుదల
September 15, 2025
0
Tags