హాకీ ఆసియాకప్ ఫైనల్లో 1-4తో చైనా చేతిలో భారత మహిళల జట్టుపరాజయం పాలైంది. పెనాల్టీ కార్నర్‌ను నవ్‌నీత్ కౌర్ గోల్‌గా మలచడంతో తొలి నిమిషంలోనే ఆధిక్యంలోకి వెళ్లిన భారత జట్టు ఆ తర్వాత వెనుకబడిపోయింది. 21వ నిమిషంలో జిక్సియా గోల్‌తో స్కోరు సమం చేసిన చైనా హాంగ్ లి (41వ), జౌ (51వ), జియాకి జోగ్ (53వ)ల గోల్స్‌తో ఘనవిజయాన్నందుకుంది. చైనాకు ఇది మూడో ఆసియాకప్ టైటిల్. ఈ టైటిల్‌తో చైనా 2026లో బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరిగే మహిళల ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత పొందింది. వచ్చే ఏడాది ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించే అవకాశం భారత మహిళల జట్టు కోల్పోయింది. ఆ టోర్నీలో చోటు కోసం భారత్ ఇక క్వాలిఫయర్స్ ఆడాల్సివుంటుంది.
హాకీ ఆసియాకప్ ఫైనల్లో భారత మహిళల జట్టు పరాజయం
September 15, 2025
0
Tags