ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విశాఖ- ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్ జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మారిటైమ్ లాజిస్టిక్స్ అభివృద్ధిపై దేశంలోని వివిధ పోర్టులు, కార్గో హ్యాండ్లింగ్ కంపెనీలకు చెందిన 62 మంది సీఈఓలతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలలో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం అని అన్నారు. ఏపీ మారిటైమ్ లాజిస్టిక్స్ రంగంలో ఉన్న అవకాశాలు, పోర్టు కార్గో హ్యాండ్లింగ్ మౌలిక సదుపాయాల కల్పన, రోడ్- రైలు కనెక్టివిటీలపై సమావేశంలో చర్చించారు. పోర్టుల పరిధిలో ఉన్న వివిధ ప్రాంతాలు, హింటర్ ల్యాండ్ కనెక్టివిటి, కార్గో రవాణా అంశాల గురించి మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ ఓడ రేవుల్లో టెర్మినళ్ల ఆధునీకరణ, కోల్డ్ చైన్ సదుపాయాలు, షిప్ బిల్డింగ్ మరమ్మతులు, ఎయిర్ కార్గో కనెక్టివిటీ అంశాలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. మారిటైమ్ లాజిస్టిక్స్‌లో అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ప్రమాణాలు, ఏపీలో ఉన్న అవకాశాలు, పెట్టుబడుల గురించి సమావేశంలో ఆయన వివరించారు. సమావేశంలో మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం !
September 02, 2025
0
Tags