రియల్‌మీ 15T విడుదల : ప్రీ-బుకింగ్‌ చేసుకున్న వారికి టీ01 బడ్స్‌ ఫ్రీ !

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్లో రియల్‌మీ 15T పేరుతో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మీడియాటెక్‌ డైమెన్సిటీ ప్రాసెసర్‌, 6400 MAX, 7000 mAh బ్యాటరీతో ఎయిర్‌ఫ్లో వీసీ కూలింగ్‌ సిస్టమ్‌ను కూడా ఇచ్చారు. అంతేకాకుండా ఈ ఫోన్‌ను ప్రీ-బుకింగ్‌ చేసుకున్న వారికి రూ.1099 విలువైన రియల్‌మీ టీ01 బడ్స్‌ ఫ్రీగా లభిస్తాయి. 6.57 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ 4ఆర్‌ కంఫర్ట్‌ ప్లస్ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. 4,000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత రియల్‌మీ యూఐ 6తో పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే.. వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ కెమెరా ఇచ్చారు. 50ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇది 7,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 60W SuperVOOC ఛార్జింగ్‌, 10W రివర్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. సిల్వర్, సిల్క్‌ బ్లూ, సూట్‌ టైటానియమ్‌ కలర్స్‌లో లభిస్తుంది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.20,999గా కంపెనీ నిర్ణయించింది.  8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.22,999 కాగా, 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.24,999గా పేర్కొంది. ఈ ఫోన్‌ విక్రయాలు సెప్టెంబర్‌ 5 నుంచి ప్రారంభమవుతాయి. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కొన్ని ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్లలో అందుబాటులోకి రానుంది. ఆన్‌లైన్‌లో ఈఎంఐ చెల్లింపులకు ఎంపిక చేసిన బ్యాంక్‌ కార్డ్‌లపై రూ.2 వేలు డిస్కౌంట్ పొందొచ్చు. లేదా మొత్తం అమౌంట్‌ చెల్లిస్తే, రూ.1000 డిస్కౌంట్‌ లభిస్తుంది. ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేస్తే ఎంపిక చేసిన బ్యాంక్‌ కార్డ్‌లపై రూ.2 వేల రాయితీ ఉంటుంది. అలాగే రూ.5 వేల వరకు ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ పొందొచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)