సెప్టెంబర్ 3 నుంచి మారుతి సుజుకి ఇ-విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. కొత్త సుజుకి మారుతి ఇ-విటారా ఎస్‌యూవీ కనిష్ట ధర రూ. 17 లక్షలు, గరిష్ట ధర రూ. 22.50 లక్షలు ఎక్స్-షోరూమ్ ఉంటుందని అంచనా. ఇది డెల్టా, జీటా, ఆల్ఫా వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ సంవత్సరం జనవరిలో ముగిసిన 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎలక్స్‌పో'లో కూడా ఇదే కారును ప్రదర్శించారు.ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వెలుపల చక్కని డిజైన్ ఉంది, దీనికి ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు, ఫాగ్ లైట్లు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ-విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ చాలా విశాలమైనది. ఇది 4,275 మి.మీ పొడవు, 4,275 మి.మీ వెడల్పు, 1,800 మి.మీ ఎత్తు ఉంది. దీనికి 180 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్, 2,700 మి.మీ వీల్‌బేస్ కూడా ఉంది. కొత్త ఇ-విటారా కారులో 5 సీట్లు ఉన్నాయి, కాబట్టి ప్రయాణీకులు సౌకర్యవంతంగా కూర్చుని ప్రయాణించచ్చు. సెలవు దినాల్లో సుదూర నగరాలకు ప్రయాణాలకు వెళ్లేటప్పుడు ఎక్కువ సామాను తీసుకెళ్లగలిగేలా 398 లీటర్ల భారీ బూట్ స్పేస్ కూడా అందించారు. ఇ-విటారాలో 49 కిలోవాట్లు, 61 కిలోవాట్లు సామర్థ్యం కలిగిన రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు పరిధిని అందిస్తుందని చెబుతున్నారు. ఈ ఇ-విటావా కారు డిజైన్ చాలా బాగుంది. ప్రయాణీకుల సౌలభ్యం కోసం10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటో ఏసీ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి.
సెప్టెంబర్ 3 నుంచి సుజుకి మారుతి ఇ-విటారా ఎస్‌యూవీ అమ్మకాలు ప్రారంభం
September 02, 2025
0
Tags