స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడిన స్నేహితుడు : వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపు

Telugu Lo Computer
0


రాజస్థాన్ లోని జైపూర్‌, కల్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోఒక యువతిపై ఆమె స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన రెండు నెలల క్రితం జరిగిందని తెలుస్తోంది. నిందితుడు తన స్నేహితురాలిని ఆమె సోదరుడి ఇంట్లో చూసి, ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ ఘటనను వీడియో తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన యువతి కొన్ని రోజులు మౌనంగా ఉండిపోయింది. అయితే, ఇటీవల ఈ విషయం యువతి సోదరుడికి తెలియడంతో ఆయన నిందితుడిని నిలదీశారు. దీంతో ఆగ్రహించిన నిందితుడు యువతి సోదరుడిపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన యువతి సోదరుడు నిందితుడిపై కల్వార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)