ఏ రాష్ట్రంపైనా భాషను బలవంతంగా రుద్దడం లేదు !

Telugu Lo Computer
0


ఐటీ మద్రాస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ ఏ రాష్ట్రంపైనా భాషను బలవంతంగా రుద్దడం లేదని, అటువంటి వాదనలు రాజకీయ ప్రేరేపితమని అన్నారు. ఈ అంశంపై పార్లమెంటులో ఇప్పటికే స్పష్టత ఇచ్చాం. తమిళనాడు పాఠశాలలో తమిళం, ఇంగ్లీష్‌, తెలుగు, ఉర్దూ, మలయాళం, కన్నడ వంటి అనేక భాషలు బోధిస్తున్నారు. తమిళం, ఇంగ్లీష్‌ కాకుండా అనేక భాషలు బోధిస్తున్నప్పుడు మూడో భాషతో ఇబ్బంది ఏంటీ? ఇది తమిళనాడు ప్రభుత్వ రాజకీయ నిర్ణయం. ఒకటి నుంచి ఐదు వరకు రెండు భాషలు, ఆరు నుంచి పది వరకు మూడు భాషలు బోధించాలి. మాతృభాష తప్పనిసరి. మిగతా రెండు విద్యార్థుల ఐచ్ఛికాలు. కేంద్ర ప్రభుత్వం ఏ భాషనూ బలవంతంగా రుద్దడం లేదు. రాజకీయ భావజాలం ఉన్నవారు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సమాజంలో కొత్త ఆలోచనను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. అనేక రాష్ట్రాలు ఇప్పటికే త్రిభాషా విధానాన్ని అనుసరిస్తున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు. సంకుచిత రాజకీయ దృక్పథం ఉన్నవారే దీన్ని వివాదంగా మారుస్తున్నారని విమర్శించారు. భాష ఆధారంగా విభజన సృష్టించాలనుకున్న వారు విఫలమయ్యారని, వాటిని దాటి సమాజం ఎంతో ముందుకు సాగిందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)