మహిళ దారుణ హత్య : దోపిడీ చేసి పరారైన పని మనిషి

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె కాళ్లు చేతులు కట్టేసి, కత్తులతో పొడిచి, ప్రెషర్ కుక్కర్​తో కొట్టి అత్యంత పాశవికంగా దుండగులు హత్యకు పాల్పడ్డారు. పది రోజుల కింద ఇంట్లో పనికి చేరిన యువకుడు మరో వ్యక్తి సహకారంతో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య అనంతరం దుండగులు అక్కడే స్నానం చేసి, పెద్ద మొత్తంలో నగలు, నగదుతో పరారైనట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం రేణు (50), రాకేశ్ అగర్వాల్ దంపతులు కూకట్‌పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో13వ ఫ్లోర్​లో కొడుకుతో కలిసి నివాసం ఉంటున్నారు. రాకేశ్​ బాలానగర్లో స్టీల్​ ట్రేడింగ్ ​బిజినెస్ చేస్తున్నాడు. రోజూ కొడుకుతో పాటు ఆఫీసుకు వెళ్లి రాత్రికి తిరిగి వస్తుంటాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం తన కొడుకుతో కలిసి ఆఫీస్​కు వెళ్లాడు. రాత్రి 7.30 సమయంలో ఇంటికి వచ్చారు. తాళం వేసి ఉండడంతో ఫ్లంబర్​ సాయంతో బాల్కనీ నుంచి తలుపు తీసి లోపలకు వెళ్లారు. అప్పటికే రేణు ​రక్తపు మడుగులో పడి, కాళ్లు, చేతులు కట్టేసి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్​ టీమ్​తో ఆధారాలు సేకరించారు. మృతురాలి ఒంటిపై, గొంతుపై కత్తులు, సిజర్స్​తో పొడిచిన ఆనవాళ్లు గుర్తించారు. కాగా, పది రోజుల కింద జార్ఖండ్​ నుంచి వచ్చిన హర్ష (20) అనే యువకుడిని ఇదే అపార్ట్​మెంట్​లో పనిచేస్తున్న రోషన్ అనే వ్యక్తి చెప్పడంతో రేణు దంపతులు ఇంట్లో పనికి పెట్టుకున్నారు వీరిద్దరూ కలిసే దోపిడీకి ప్లాన్​ చేసి ఉంటారని, రేణు అగర్వాల్​అడ్డుకోవడంతోనే ఆమెను హత్య చేసి, దోపిడీ చేసి పరారై ఉంటారని ప్రాథమిక ఆధారాలతో పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులుగా భావిస్తున్న ఇద్దరు యువకులు లిఫ్ట్​లో బయటకు ఒక బ్యాగ్​తో కలిసి వెళుతుండడం సీసీ కెమెరాలో రికార్డయింది. వీరిద్దరే హత్యకు పాల్పడి ఉంటారని దాదాపు నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే, ఎంత మొత్తం దోపిడీ జరిగిందనేది నిర్ధారణ కాలేదని పోలీసులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)