హైదరాబాద్ లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిటీ యూనియన్ బ్యాంక్‌లో రూ.25లక్షలు డ్రా చేసేందుకు బుధవారం కస్టమర్ వచ్చాడు. అంత సొమ్ము లేకపోవడంతో అసిస్టెంట్ మేనేజర్ నాగార్జున, సెక్యూరిటీ గార్డును బ్యాంక్ మేనేజర్ సికింద్రాబాద్‌లోని బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి డబ్బు తీసుకురావాలని పంపగా, వారు మధ్యాహ్నం డబ్బు పెట్టె తీసుకొని క్యాబ్ బుక్ చేసుకున్నారు. అప్పటికే ఆ పెట్టెలో డబ్బుందని తెలుసుకున్న క్యాబ్ డ్రైవర్ దారి మధ్యలో కారు నిలిపి బ్యాటరీ ఆన్ కావడంలేదని దిగి తోయాలని ఉద్యోగులకు చెప్పాడు. అసిస్టెంట్ మేనేజర్ లోపల కూర్చొగా, సెక్యూరిటీ గార్డు దిగి తోయగా కారు స్టార్ట్ చేశాడు. డబ్బు కొట్టేసేందుకు పథకం ఫెయిల్ కాగా బ్యాంక్ వద్దకు వచ్చిన తర్వాత గేటు లోపలికి వెళ్లాలని డ్రైవర్‌కు అసిస్టెంట్ మేనేజర్ చెప్పగా డ్రైవర్ మాత్రం డబ్బు కాజేయాలన్న ఆలోచనతో ముందు కారు అడ్డుగా ఉందని లోపలికి వెళ్లడం కష్టమని చెప్పగా, ఇద్దరూ చెరోవైపు తలుపు తీసుకొని దిగిపోయారు. వెంటనే డ్రైవర్ డబ్బు పెట్టెతో సహా కారులో ఉడాయించినట్లు ఏసీపీ నరేశ్‌రెడ్డి తెలియజేశారు. నిందితుడిని నిజామాబాద్‌కు చెందిన ఉస్మాన్‌అలీ (40)గా గుర్తించినట్లు సమాచారం.
రూ.25 లక్షల బ్యాంకు సొమ్ముతో ఉడాయించిన క్యాబ్ డ్రైవర్ !
September 11, 2025
0
Tags