పిడుగుపాటుకు ఆరుగురు బలి : నలుగురికి తీవ్ర గాయాలు

Telugu Lo Computer
0


తెలంగాణలో పిడుగుపాటుతో రెండు వేర్వేరు జిల్లాల్లో ఆరుగురు రైతులు ప్రాణాలు కోల్పగా. నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మెఎంగ్లాపూర్ గ్రామంలో రైతులు పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. కొద్దిసేపటికి మెరుపులు మెరుస్తూ గాలివాన మొదలైంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా పిడుగు పడి రైతు దంపతులు ఎల్లయ్య, ఎల్లవ్వలతో పాటు రైతు కూలీ వెంకటి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రంలో రైతులు వ్యవసాయ పనులు ముగించుకుని పొలాల్లో ఉండగా వర్షం ప్రారంభమైంది. ఆ సమయంలో పిడుగుపడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను స్థానికులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఒక్కరోజులోనే రెండు జిల్లాల్లో పిడుగుపాటుకు గురై ఆరుగురు రైతులు ప్రాణాలు కోల్పోవడం, నలుగురు తీవ్రంగా గాయపడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గ్రామాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. రైతులు కుటుంబ సభ్యులు మృతదేహాలను చూసి మౌనం విడిచారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున విపత్తు సహాయక నిధి (ఎక్స్ గ్రేషియా) కింద మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)