సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై రౌడీషీట్లు, హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తెరవాలని తెలంగాణ డీజీపీ జితేందర్ ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఇటీవల సోషల్ మీడియాలో సైబర్ నేరాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎంతోమంది అమాయకులు వీటి బారీన పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సైబర్ నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదల పెట్టవద్దని డీజీపీ జితేందర్ ఆదేశించారు. ఇలా చేస్తే సైబర్ నేరాలకు అడ్డుకట్టు వేయవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై రౌడీషీట్లు, హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు !
September 25, 2025
0
Tags