మణిపూర్‌లో బాధితులను పరామర్శించిన ప్రధాని మోడీ

Telugu Lo Computer
0


మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణలకు కేంద్రమైన చురాచంద్‌పుర్‌ జిల్లాకు ప్రధాని మోడీ చేరుకున్నారు. అక్కడ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. హింసాత్మక ఘటనల వల్ల నిరాశ్రయులైన వారితో మాట్లాడారు. 2023లో ఈ ఘర్షణలు చోటుచేసుకోగా, రెండేళ్ల తర్వాత ప్రధాని ఆ రాష్ట్రానికి వెళ్లారు. మెయిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రతిపాదనపై వచ్చిన వ్యతిరేకత 2023లో మణిపూర్‌ను హింసాత్మకంగా మార్చిన సంగతి తెలిసిందే. వారికి రిజర్వేషన్లు ఇవ్వవద్దని ఆదివాసీ తెగలు డిమాండ్‌ చేశాయి. మెయిటీలకు రిజర్వేషన్లు దక్కితే వారు తమ అటవీ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటుచేసుకోవడంతో పాటు తమకు రావాల్సిన ఉద్యోగాల్లో వాటా తగ్గిపోతుందని వారు ఆందోళన చెందారు. ఆ నిరసనలకు చురాచంద్‌పుర్‌ కేంద్రమైంది. రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాలను రిజర్వ్‌ ప్రాంతాలుగా ప్రకటించడంతో కొండలపై నివాసమున్నవారు ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం పునరావాసం కల్పించకుండా తమను తరలించడంపై నిరసన వ్యక్తంచేశారు. దీనికితోడు రిజర్వేషన్ల అంశం తెర పైకి రావడంతో నిరసనలు ఘర్షణ రూపం దాల్చాయి. ఆ క్రమంలో అమానవీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. మణిపుర్‌లో చెలరేగిన అల్లర్లలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా కొన్ని వేలమంది నిరాశ్రయులయ్యారు. పలువురి ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ హింసపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న బీరెన్‌సింగ్ ఈ ఏడాది తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)