ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్ట్ సమీపంలోని ఇండస్ట్రియల్ ఏరియాలోని డెక్సన్ మొబైల్ కంపెనీ పక్కనే ఉన్న మునోత్ గ్రూప్ లిథియం సెల్ యూనిట్లో మంటలు చెలరేగాయి. అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు దాదాపు పది ఫైర్ ఇంజన్లు రంగంలోకి దించారు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటలు భారీగా చెలరేగడంతో ఫ్యాక్టరీలోని బ్యాటరీలు, మిషనరీ, ముడి పదార్థాలు కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
రేణిగుంట ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం
September 18, 2025
0
Tags