అమెరికాతో యుద్ధానికి సిద్ధం !

Telugu Lo Computer
0


మెరికాతో సాయుధ పోరాటానికి కూడా వెనుకాడబోమని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో తీవ్రంగా హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులాకు యుద్ధనౌకలు పంపించిన నేపథ్యంలో తమ దేశం గత వందేళ్లలో ఎన్నడూ లేనంత పెద్ద ముప్పును ఎదుర్కొంటోందని మదురో అన్నారు. అమెరికా సైనిక దాడికి సిద్ధమవుతోందని భావించిన వెనిజులా ప్రభుత్వం తమ సరిహద్దుల్లో సైనికులను మోహరించింది. దేశ ప్రజలందరినీ త్వరగా సైన్యంలో చేరాలని నికోలస్ మదురో పిలుపునిచ్చారు. డ్రగ్స్ స్మగ్లింగ్‌ను అరికట్టడానికే యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, సైనిక బృందాలను పంపుతున్నామని అమెరికా ప్రకటించింది. అయితే ఇది దాడికి ఒక సాకు మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మాట్లాడుతూ వెనిజులాను లక్ష్యంగా చేసుకుని 1,200 క్షిపణులతో కూడిన 8 యుద్ధనౌకలు, ఒక అణు జలాంతర్గామిని మోహరించారు. ఇది చాలా ప్రమాదకరమైన, అనైతికమైన ముప్పు" అని అన్నారు. అమెరికా గరిష్ట సైనిక ఒత్తిడితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. అందుకే మేము వెనిజులాలో గరిష్ట స్థాయి సన్నద్ధతను ప్రకటించామని మదురో వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)