లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వినాయక నిమజ్జనం వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్‌కు చెందిన తర్రె చైతన్య, రిషితేజగా గుర్తించారు. లండన్‌లో నివాసం ఉంటున్న కొంతమంది తెలుగు విద్యార్థులు వినాయక నిమజ్జనంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వీరి కారును వేరొక కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చైతన్య, రిషితేజ అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరూ హైదరాబాద్‌లోని నాదర్‌గుల్, ఉప్పల్ ప్రాంతాలకు చెందినవారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఐదుగురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారేనని సమాచారం.
లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
September 02, 2025
0
Tags