టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కొద్ది రోజుల క్రితమే పెద్ద ఎత్తున ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించి షాకిచ్చిన సంస్థ ఇప్పుడు ఉద్యోగులకు పెద్ద మొత్తంలో ఇంక్రిమెంట్లు పెంచుతూ ప్రకటన చేసింది. ఇంక్రిమెంట్ లెటర్లను తమ ఉద్యోగులకు మెయిల్ చేసింది. ఉద్యోగుల కేటగిరీలు పనితీరు ఆధారంగా 4.5 శాతం నుంచి 7 శాతం వరకూ వేతనాలు పెంచారు. ఈ పెంపు సెప్టెంబర్ నెల నుంచే వర్తిస్తుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. తాజాగా టీసీఎస్ ప్రపంచ వ్యాప్తంగా తన మొత్తం ఉద్యోగుల్లో 2 శాతం మందికి ఉద్వాసన పలకనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది కల్లా దాదాపు 12,200 మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడనున్నది. వీరిలో ఎక్కువగా మధ్య స్థాయి, సీనియర్ స్థాయి ఉద్యోగులపైనే ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఈ ఆందోళనతో కనిపిస్తున్న ఉద్యోగులకు ఊరటనిస్తూ సంస్థ ఇంక్రిమెంట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 80 శాతం ఉద్యోగుల వేతనాలను పెంచుతున్నట్లు టీసీఎస్ ప్రకటించింది. జూనియర్, మధ్య స్థాయి (సీ3ఏ గ్రేడ్ వరకు) ఉద్యోగులకు సెప్టెంబర్ 1 నుంచి వేతన పెంపులను అమలు చేయనున్నట్టు ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్‌లో టీసీఎస్ సీహెచ్‌ఆర్‌వో మిలింద్ లక్కడ్ తెలిపారు.
టీసీఎస్ ఉద్యోగుల కేటగిరీలు పనితీరు ఆధారంగా వేతనాలు పెంపు
September 02, 2025
0
Tags