ఇండో--అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ మొదటి మహిళా చైర్మన్‌ శ్రీదేవి

Telugu Lo Computer
0


ఇండో--అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చాప్టర్ 2025-26 అధ్యక్ష సంవత్సరానికి గాను దేవిరెడ్డి శ్రీదేవిని చైర్మన్‌గా నియమించింది. సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి ఆమె మొదటి మహిళా చైర్మన్ కావడం విశేషం. ఆమె ఐఐఎం -కోజికోడ్‌లో చదివారు. భారత ప్రభుత్వం నుంచి నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు, యూకే ప్రభుత్వం నుంచి చెవెనింగ్ ఫెలోషిప్ పొందారు. ప్రస్తుతం ఏఎస్‌ఐపీ టెక్నాలజీస్‌లో హెచ్‌ఆర్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్‌ విభాగాన్ని నడుపుతున్నారు. శ్రీదేవి ఇండియా-అమెరికన్ వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడం, ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి, వ్యూహాత్మక భాగస్వామ్యాలను ప్రోత్సహించడం వంటి అంశాలపై దృష్టి పెడతారని సంస్థ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. కమిటీ సభ్యుల్లో బీ ప్రభాకర్ రావు (ఫస్ట్ వైస్ చైర్మన్‌), శంకర్ కూనా (సెకెండ్ వైస్‌ చైర్మన్‌)తో పాటు వివిధ రంగాల నిపుణులు ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)