టీజీపీఎస్సీ గ్రూప్ -1 టాపర్ గా లక్ష్మీ దీపిక

Telugu Lo Computer
0


టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫైనల్ లిస్టు చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. విడుదల చేశారు. మొత్తం 563 పోస్టులకు గాను 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. గ్రూప్ 1 టాపర్‌గా లక్ష్మీదీపిక నిలిచారు. లిస్టును టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో పెట్టారు. గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్‌ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. 21 వేల మందికి పైగా పరీక్షలకు అటెండ్ అయ్యారు. జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్ఎల్)ను మార్చిలో రిలీజ్ చేశారు. ఇప్పటికే నాలుగు విడతలుగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. అయితే గ్రూప్‌ 1 రిక్రూట్‌మెంట్‌ను నిలిపివేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో టీజీపీఎస్సీ అప్పీల్ చేసింది. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలు అనుకూలంగా రావడంతో టీజీపీఎస్సీ కమిటీ అత్యవసరంగా సమావేశమై గ్రూప్‌ 1 నియామకాలపైనే గ్రూప్ 2, గ్రూప్ 3 రిక్రూట్మెంట్ ఆధారపడి ఉండటంతో వెంటనే ఫైనల్ లిస్టు రిలీజ్ చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా బుధవారం అర్ధరాత్రి 562 మంది సెలక్షన్ లిస్టును విడుదల చేశారు. మల్టీజోన్ల వారీగా ఏ పోస్టుకు ఎవరు ఎంపికయ్యారనే వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టారు. టాప్ టెన్ ర్యాంకర్ల పేర్లనూ కమిషన్ వెల్లడించింది. వీరంతా డిప్యూటీ కలెక్టర్లుగా ఎంపికైనట్టు ప్రకటించింది. అయితే, హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల నేపథ్యంలో ఈ రిజల్ట్స్‌ ఫైనల్ జడ్జిమెంట్‌కు లోబడి ఉంటాయని కమిషన్ పేర్కొంది. తప్పుడు సమాచారంతో ఎంపికైన వాళ్లను ఏదశలోనైనా తొలగిస్తామని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)