స్మితా సభర్వాల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ

Telugu Lo Computer
0


కాళేశ్వరం నివేదిక ఆధారంగా తెలంగాణ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి స్మితా సభర్వాల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం అవకతవకల అంశంపై పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను హైకోర్టులో ఆమె సవాల్‌ చేసిందే. నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని సవాల్‌ చేసిన ఆమె, ఆ నివేదికను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పిటిషన్‌ను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం ప్రస్తుతానికి ఆమెకు ఊరటనిస్తూ తదుపరి విచారణ వాయిదా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)