తల్లికి పోషణ ఖర్చులు చెల్లించేందుకు నిరాకరించిన కుమారుడికి జైలు శిక్ష విధించిన కోర్టు !

Telugu Lo Computer
0


కేరళలో వృద్ధురాలైన తల్లికి పోషణ ఖర్చులు చెల్లించేందుకు నిరాకరించిన ఓ వ్యక్తికి  కోర్టు జైలు శిక్ష విధించింది. 'తల్లిదండ్రుల, వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం-2007' కింద ఎలియమ్మ జోసెఫ్‌కు నెలకు రూ.2 వేల చొప్పున ఖర్చులు చెల్లించాలని ఆమె కుమారుడు, మాడికై మాలప్పచెరికి చెందిన ప్రతీశ్‌కు ట్రైబ్యూనల్‌ గతంలో ఆదేశించింది. దీన్ని అతడు పట్టించుకోలేదు. దీంతో ఆమె మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పలుమార్లు నోటీసులు వచ్చినా బేఖాతరు చేశాడు. ఖర్చులు చెల్లించేందుకు మొండికేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి ఆర్డీవో కోర్టు ముందు హాజరుపరిచారు. అక్కడా అదే వాదన వినిపించాడు. ఈ క్రమంలోనే ఆరు నెలల బకాయిలు రూ.12 వేలు చెల్లించే వరకు అతడిని జైలు ఉంచాలని కోర్టు ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)