ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 2.38 గంటలకు ఎయిరిండియా విమానం హైదరాబాద్ బయలుదేరింది. కొంతదూరం వెళ్లాక విమానం రెండో ఇంజిన్‌లో పక్షి ఇరుక్కుంది. దీంతో అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా వ్యవహరించి 3 గంటల సమయంలో విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ సమయంలో విమానంలో మొత్తం 103 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఎయిర్ ఇండియా యాజమాన్యం ఏర్పాట్లు చేసింది.
ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం : రెండో ఇంజిన్‌లో ఇరుక్కున్న పక్షి
September 18, 2025
0
Tags