భారత్‌ కలిసి ఉండాల్సింది అమెరికాతో రష్యాతో కాదు !

Telugu Lo Computer
0


చైనా తియాంజిన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు వేదికగా ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోడీ  భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ దరిమిలా ఈ భేటీని సిగ్గుచేటుగా అభివర్ణిస్తూ అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో తీవ్ర విమర్శలు చేశారు. వాషింగ్టన్‌లో జరిగిన మీడియా సమావేశంలో నవారో మాట్లాడుతూ భారత ప్రధాని మోడీ, పుతిన్, షీ జిన్‌పింగ్‌లతో కలిసి ఉండటం సిగ్గుచేటు. ఆయన ఏమి ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ, భారత్‌ కలిసి ఉండాల్సింది అమెరికాతో రష్యాతో కానేకాదు అని అన్నారు. అమెరికా విధించిన టారిఫ్‌లపై భారత్‌ స్పందించిన తీరు, అలాగే రష్యా నుంచి భారత్‌ ముడి చమురు కొనుగోలు కొనసాగించడాన్ని నవారో తీవ్రంగా విమర్శించారు. భారత్‌ ముడి చమురు కొనుగోలు ద్వారా పుతిన్‌ యుద్ధానికి నిధులు సమకూర్చుతోంది అని మరోసారి ఆరోపించారు. భారత్‌ను సుంకాల మహరాజుగా అభివర్ణించిన ఆయన.. రష్యా చమురు కొనుగోలు విషయంలో వాస్తవాల్ని దాచిపెడుతోందని అన్నారు. భారత్‌లో కుల వ్యవస్థను ప్రస్తావిస్తూ.. ఓ వర్గం సాధారణ ప్రజల ఖర్చుతో లాభపడుతోంది అంటూ తీవ్రవ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇండియన్ రిఫైనరీలు రష్యా రాయితీ ధరకు ముడి చమురును ప్రాసెస్ చేసి, అధిక ధరలకు ఎగుమతి చేస్తున్నాయని, ఇది "క్రెమ్లిన్ లాండ్రోమాట్"లా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రెమ్లిన్ లాండ్రోమాట్ ఆరోపణకు అర్థం ఏంటంటే.. భారత రిఫైనరీలు రష్యా డబ్బును "శుభ్రం" చేసి, ప్రపంచ మార్కెట్‌లో తిరిగి ప్రవేశపెడుతున్నాయి అని. తద్వారా రష్యా చమురు అమ్మకాలు కొనసాగుతాయని, పుతిన్‌కు ఆర్థిక లాభం కలుగుతుందని, ఇది ప్రత్యక్షంగా రష్యా యుద్ధ వ్యయానికి నిధులు సమకూర్చే మార్గంగా మారుతుందని ఆయన అభిప్రాయం.

Post a Comment

0Comments

Post a Comment (0)