విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక్కడ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.93 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో 69 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. లంక గ్రామాల ప్రజలను జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీ నంచి కృష్ణా నదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కృష్ణా నదికి వరదల దృష్ట్యా మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కొల్లూరు మండల కంట్రోల్ రూమ్ నంబర్: 77948 94544, భట్టిప్రోలు మండల కంట్రోల్ రూమ్ నంబర్: 81798 86300.
ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక : 69 గేట్లు ఎత్తివేత
September 28, 2025
0
Tags