కర్నాటకలోని అలంద్ నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6018 ఓట్లు అక్రమ మార్గాల్లో తొలగించారని ఆరోపిస్తూ ఇవాళ విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ ట్వీట్ చేసింది. రాహుల్ ఆరోపణల్లో పస లేదని, వీటికి ఎలాంటి ఆధారాలు లేవని, అసలు ఓటరుకు తెలియకుండా ఓట్ల తొలగింపు జరగదని కూడా తెలిపింది. కర్నాటకలో ఓట్ల తొలగింపు జరిగిన విధానంపై ఇవాళ ఉదయం ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ అందులో కర్నాటక సీఐడీ వీటిపై విచారణ జరిపి సీఈసీ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అయితే దీనిపై ట్వీట్ చేసిన ఈసీ.. రాహుల్ ఆరోపణలు నిరాధారమని తేలిపింది. 2023లో అలంద్ లో ఓట్ల తొలగింపు ప్రయత్నాలు జరిగాయని, వీటిపై తామే స్వయంగా విచారణ జరుపుతున్నట్లు ప్రకటించింది. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ అలంద్ లో ఓట్ల తొలగింపుపై 18 నెలల్లో సీఈసీకి కర్నాటక సీఐడీ 18 లేఖలు రాస్తే పట్టించుకోలేదని రాహుల్ ఆరోపించారు. విచారణకు సహకరించాలని సీఈసీకి కర్నాటక ఈసీ లేఖలు రాసినా మౌనంగా ఉండిపోయిందన్నారు. ఓట్ల చోరీ చేసిన కంప్యూటర్ల ఐపీ అడ్రస్ లు, డివైజ్ పోర్టులు, ఓటీపీ ప్రయత్నాలపై ఆధారాలు ఇచ్చినా ఈసీ పట్టించుకోలేదన్నారు. ఈ ఓట్ల దొంగతనం పట్టుబడి ఉండకపోతే మరియు 6,018 ఓట్లను తొలగించి ఉండకపోతే, తమ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయేవారని రాహుల్ గాంధీ తెలిపారు. కాబట్టి సీఈసీ జ్ఞానేష్ కుమార్ సాకులు చెప్పడం ఆపాలని కోరారు. ఆధారాలను ఇప్పుడే కర్ణాటక సీఐడీకి విడుదల చేయాలని ఆయనకు సూచించారు.
కర్నాటకలో 6018 ఓట్లు అక్రమ మార్గాల్లో తొలగించారన్న రాహుల్ : ఓటరుకు తెలియకుండా ఓట్ల తొలగింపు జరగదన్న ఈసీ
September 18, 2025
0
Tags