కల్కి 2లో దీపికా పదుకొనే ఉండడం లేదని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వైజయంతి మూవీస్ తమ X అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ''దీపికా పదుకొనే కల్కి 2 లో భాగం కారు. చాలా ఆలోచించి, మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అంటూ తెలిపారు. మొదటి భాగాన్ని తెరకెక్కించేటప్పుడు చాలా సుదీర్ఘ ప్రయాణం చేశాం. ఇలాంటి ఒక ప్రాజెక్ట్‌కి కావాల్సిన కమిట్‌మెంట్ మాకు ఆమె నుంచి కనిపించలేదు. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.'' అని ప్రొడక్షన్ హౌస్ ట్వీట్ చేసింది. అంతటి పెద్ద ప్రాజెక్ట్ నుంచి దీపికా బయటకి రావడం వెనుక కారణాలు ఏమిటి అన్న దానిపై సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. దీని ముందు కూడా ఆమె ప్రభాస్ మరో సినిమా 'స్పిరిట్' నుంచి తప్పుకున్నా సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆమె షిఫ్ట్ డిమాండ్ చేసింది రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తానని. ఈ విషయం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కు నచ్చక, ఆమెను తక్షణమే ప్రాజెక్ట్ నుంచి తీసేసినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ కల్కి 2 విషయంలోనూ అదే తరహా పరిస్థితులు ఏర్పడినట్టు తెలుస్తోంది. దీపికా టీం నుంచి వచ్చిన కొన్ని అసాధ్యమైన డిమాండ్లు మేకర్స్ కి నచ్చక, ఆమెను రీప్లేస్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా, ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన స్థాయి కమిట్‌మెంట్ ఆమె చూపించలేకపోయిందనే విషయం ప్రొడక్షన్ టీం స్వయంగా చెప్పడం, ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
కల్కి 2 లో దీపికా పదుకొనే ఉండడం లేదు : వైజయంతి మూవీస్
September 18, 2025
0
Tags