మదర్ డెయిరీ సంస్థ పాల ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గించిన కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. పాలు మాత్రమే కాకుండా నెయ్యి తదితర అనేక ఉత్పత్తులపై ప్రభుత్వం జీఎస్టీలో మార్పులకు అనుగుణంగా ధరల తగ్గింపును ప్రకటించింది. లీటర్ టోన్డ్ టెట్రా ప్యాక్ ధర రూ.77 నుంచి రూ.75 కు తగ్గింది. అలాగే ఎవ్రీడే పాలీ ప్యాక్ మిల్క్ ఎప్పట్లానే జీఎస్టీ మినహాయింపులు కొనసాగుతాయి. అంతేకాక పనీర్, వెన్న, జున్ను, నెయ్యి, మిల్క్ షేక్, ఐస్ క్రీమ్ ధరలు కూడా తగ్గినట్లు మదర్ డెయిరీ పేర్కొంది. దాంతో 500 గ్రాముల వెన్న ప్యాకెట్ ధర రూ.305 నుంచి రూ.285కు చేరింది. బటర్ స్కాచ్ కోన్ ఐస్ క్రీమ్ ధర రూ.35 నుంచి రూ.30కు తగ్గింది.
సెప్టెంబర్ 22 నుండి తగ్గనున్న మదర్ డెయిరీ పాల ఉత్పత్తుల ధరలు
September 16, 2025
0
Tags